రైతులకే నష్టం అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ : రోడ్లపై పాలు, కూరగాయలతో నిరసనలు

rytఏడు రాష్ట్రాలలో రెండో రోజు రైతుల ఆందోళన కొనసాగుతుంది. పాలు, కూరగాయల సరఫరాను పూర్తిగా నిలిపేశారు. పాలు పారబోసి, కూరగాయలు రోడ్డు పడేసి నిరసన తెలియజేస్తున్నారు రైతులు. రైతుల నిరసనతో ఢిల్లీలోని ఓక్లా మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పాలు, కూరగాయలు, పళ్లు తీసుకుని పట్టణాలకు వెళ్లే ప్రసక్తే లేదంటున్నారు రైతులు. పట్టణాల్లో ఉన్న వారికి ఏమైనా కావాలంటే గ్రామాలకే రావాలంటున్నారు. 10 రోజుల వరకు పాల నుంచి పచ్చిమిర్చి దాకా అన్నీ బంద్ అని తేల్చి చెప్పారు. రైతుల నిరసనలతో మొదటి రోజే కూరగాయలు, పాల సరఫరా 50 శాతం వరకు పడిపోయింది. నాసిక్ మార్కెట్ కు రోజూ 300 ట్రక్కుల కూరగాయలు వస్తే.. సమ్మె మొదటి రోజు 3 ట్రక్కులు వచ్చాయంటే ఆందోళన తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
గావ్ బంద్ పేరుతో 7 రాష్ట్రాల్లో శుక్రవారం(జూన్-1) నుంచి 10 రోజుల సమ్మె ప్రారంభించారు రైతులు. పంట రుణాల మాఫీ, కనీస మద్దతు ధర, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు డిమాండ్ తో ఆందోళన మొదలుపెట్టారు రైతులు. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల రైతులు ఈ నిరసనోధ్యమంలో పాల్గొంటున్నారు. ఈ నెల 10న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు రైతులు.

రైతుల ఆందోళనపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ శనివారం(జూన్-2) స్పందించారు. రైతుల ఆందోళనపై స్పందించిన ఖట్టర్.. రైతులకు ఎటువంటి ఇబ్బందుల్లేవని, కేవలం అనవసర అంశాలపైనే రైతులు ఫోకస్ చేస్తున్నారు అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. పంటలను అమ్మకుండా రోడ్లపై పారబోయడం వల్ల రైతులే నష్టపోయే పరిస్ధితి వస్తుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates