రైతులపై అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు : పోచారం

POCHARAMఅకస్మాత్తుగా రైతు చనిపోతే… ఆ కుటుంబం వీధిన పడకుండా ఆదుకునేందుకు రైతుబీమా ప్రారంభించినట్టు చెప్పారు మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్. సోమవారం (జూన్-18) కరీంనగర్ జిల్లాలో  రైతులకు బీమాపై మంత్రులు అవగాహన కల్పించారు. 50 లక్షల మంది రైతులకు 11వందల కోట్ల ప్రీమియాన్ని చెల్లించనున్నట్టు చెప్పారు.

జూన్ 31లోగా అన్ని గ్రామాల్లోని రైతు సమన్వయ సమితి సభ్యులు…బీమా ఫారాలు నింపి అధికారులకు అందచేయాలని కోరారు. ఆగస్ట్ 15 నుంచి బీమా పాలసీలను రైతులకు అందిస్తామన్నారు. ఈ క్రమంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే…జరిమానా విధిస్తామని చెప్పారు. త్వరలోనే ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చి, కోటి ఎకరాలకు సాగు నీరందిస్తామని తెలిపారు మంత్రి పోచారం.

Posted in Uncategorized

Latest Updates