రైతులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను గమనించాలి

వరంగల్ రూరల్ : కేంద్ర ప్రభుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ వ్యవసాయ బిల్లుల ద్వారా రైతులకు నష్టం వాటిల్లుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వటం లేదని విమర్శించారు. జిల్లాలోని వర్ధన్నపేట మండల కేంద్రము లోని లక్ష్మి గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికలు సన్నాహక సమావేశంలో ఆయ‌న పాల్గోన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పేద ప్రజలకు పనికివచ్చే వస్తువుల పై కేంద్రం రేట్ పెంచి భారం చేసిందన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేసిన డబ్బులో మనకు సగానికి కూడా ఇవ్వటం లేదని,గుజరాత్ కు కేటాయించారని తెలిపారు. రైతులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలు గమనించాలన్నారు

Latest Updates