రైతుల ఆందోళన మీడియా జిమ్మిక్కా! : కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిపై కేసు నమోదు

rtyరైతుల ఆందోళనపై (మే-31) వివాదాస్పద కామెంట్లు చేసినందుకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ పై కేసు నమోదైంది. పంటకు గిట్టుబాటు ధర, స్వామినాథన్ కమీషన్ సిఫార్సులను అమలు చేయాలంటూ 4 రోజులుగా ఏడు రాష్ట్రాలలోని రైతులు 10రోజుల ఆందోళనకు పిలుపునిచ్చారు. రైతులు చేస్తున్న ఆందోళను మీడియా జిమ్మిక్కుగా రాధా మోహన్ సింగ్ వర్ణించారు. పాట్నాలోని ప్రెస్ కాన్ఫరెన్స్ లో శనివారం ఆయన మాట్లాడుతూ… దేశంలో 12-14 కోట్ల మంది రైతులు ఉన్నాయన్నారు.  దేశంలోని ఏ రైతుల ఆర్గనైజేషన్ లో అయినా 1000-2000 మంది రైతులు ఉండటం సాధారణమేనని, మీడియా అటెన్షన్ ను పొందటానికి వాళ్లు ఏదొక ఎక్ట్రార్డనరీ పని చేయాలని రాధామోహన్ అన్నారు. రాధామోహన్ రైతులపై చేసిన కామెంట్లు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. అతన్ని వెంటనే వ్యవసాయమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ రాజకీయపార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates