రైతు కాలర్ ఎగరేసే రోజులు తీసుకువచ్చాం : కేటీఆర్

ktrగ్రామీణ ప్రాంతాల్లోనూ ఫ్యాక్టరీలు రావడంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయని తెలిపారు మంత్రి కేటీఆర్. సోమవారం (జూన్-25) నిజామాబాద్ లోని బొధన్  రైస్ మిల్లర్ అసొసియేషన్ సభ్యులు TRS చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు కేటీఆర్. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు రావడంతో ఎంతోమందికి ఉపాధి కలుగుతుందని, దీంతో ఉన్న ఊరిలోనే సంతోషంగా గడుపుకునే అవకాశం ఉంటుందన్నారు.

తెలంగాణ వస్తే పరిపాలన చేస్తారా అని హేళన చేసిన వారే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని చూసి ముక్కునవేలు వేసుకునే రోజులు వచ్చాయన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనే విధంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణపై ఎన్నో విమర్శలు చేశారని గుర్తు చేశారు మంత్రి. 24 గంటల కరెంటు ఇచ్చి, రైతు కాలర్ ఎగరేసే రోజులు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు.  ప్రాజెక్టులతో కోటీ ఎకరాలకు సాగు నీరి ఇచ్చి తెలంగాణ భూములన్నీ సస్యశ్యామలం చేస్తామన్న కేటీఆర్..రైతుబంధుతో చరిత్ర సృష్టించామన్నారు. భారత దేశానికి అన్నంపెట్టే రాష్ట్రం తెలంగాణగా అడుగులు వేస్తుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates