రైతు బంధు చెక్కును తిరిగి ఇచ్చేసిన సినీ దర్శకుడు హరీష్ శంకర్

harish shankar 2రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు బంధు స్కీం విజయవంతంగా కొనసాగుతోంది. కొంతమంది తమకు వచ్చిన చెక్కులను తిరిగి ప్రభుత్వానికి అందిస్తూ తమ ఉదారతను చాటుతున్నారు. ఇందులో బాగంగానే సినీ దర్శకుడు హరీష్ శంకర్… రైతు బంధు పథకం కింద వచ్చిన చెక్ ను  స్థానిక MLA సమక్షం లో గ్రామ సర్పంచ్ కు అందచేశారు.

మహబూబ్ నగర్ జిల్లా కమ్మదనం గ్రామం లో తనకు ఉన్న భూమికి గాను కొంత మొత్తం వచ్చిదన్నారు హరీష్ శంకర్. ఎవరన్నా పేద రైతు సహయార్ధం ఇది వాడితే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశము తో ఈ మొత్తానికి మరికొంత జోడించి సర్పంచ్ కి చెక్ ను అందచేస్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమానికి తన చెక్కును ఉపయోగించాల్సిందిగా కోరారు.

Posted in Uncategorized

Latest Updates