రైతు బంధు పథకంలో అవినీతి విషయం వాస్తవం: పోచారం

POCHARAMరైతు బంధు పథకంలో అవినీతి జరుగుతున్న విషయం వాస్తవమన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇండియా టుడే అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్లిన మంత్రి  శనివారం(జూన్-23) ఉదయం మీడియాతో మాట్లాడారు. ..అవినీతి విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లిందన్నారు. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అంతేకాదు ఎకరానికి ఏడాదికి రూ. 8 వేలు పెట్టుబడి రాయితీ అందిస్తున్నాన్నారు మంత్రి పోచారం. అంతేకాదు వచ్చే ఏడాది నుంచి కోటి ఎకరాలకు సాగునీరు అందించే పథకాన్ని కూడా అమలు చేస్తామన్నారు. శనివారం(జూన్-22) ఉదయం మీడియాతో మాట్లాడారు. పంట పెట్టుబడి రాయితీ పథకంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పెట్టుబడి రాయితీ పథకం ద్వారా 1.50 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో గొప్ప పథకం రైతు బీమా పథకమన్నారు. రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు అందించేది రైతు బీమా పథకమన్నారు. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులే అధికంగా ఉన్నారన్నారు. అసంఘటిత శక్తిని సంఘటితం చేసేదే రైతు సమన్వయ సమితుల పథకమన్న మంత్రి పోచారం… 1.61 లక్షల మంది సభ్యులను రైతు సమన్వయ సమితుల్లో నియమించామన్నారు.

Posted in Uncategorized

Latest Updates