రైతు బంధు విధివిధానాలను ప్రకటించిన ప్రభుత్వం

FORMERరైతు బంధు పథకం విధివిధానాలను బుధవారం (ఏప్రిల్-4) ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా 2018-19 ఖరీఫ్ నుంచి చెక్కుల ద్వారా ఎకరానికి 2 పంటలకు రూ. 4 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. రైతు బంధు పథకం కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు కానుంది. రైతుబంధు పథకం కోసం వ్యవసాయ, ఆర్థిక, బ్యాంకింగ్, స్టేట్ సమాచార శాఖ అధికారుల అధ్యక్షతన రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తారు. 8 బ్యాంకుల ద్వారా రైతులకు ఇచ్చే చెక్కులను ముద్రించనున్నారు.

రూ. 50 వేల లోపు వారికి సింగిల్ చెక్కు ఇవ్వనున్నారు. రూ. 50 వేలు దాటితే రెండు చెక్కులు జారీ చేస్తారు. పట్టాదారులకే నేరుగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. చెక్కుల పంపిణీ వివరాలు ప్రతి రోజు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. చెక్కులపై పట్టాదారు పేరు, ఆధార్ నెంబర్, వయస్సు, పాస్‌బుక్ నెంబర్, రెవెన్యూ విలేజ్, మండలం, జిల్లా, సాయం మొత్తం, కమిషనర్, డైరెక్టర్ స్పెసిమన్ సంతకం, మొబైల్ నెంబర్ వివరాలు ఉండనున్నాయి. చెక్కులపై రైతు బంధు పథకం పేరును కూడా ముద్రిస్తారు. చెక్కు చెల్లుబాటు కాలం మూడు నెలలు మాత్రమే ఉంటుంది. తర్వాత కొత్త చెక్కు తీసుకోవాల్సి ఉంటుంది. చెక్కుల పంపిణీని డీఏఓలు, జిల్లా ఉద్యానవన అధికారులు, సహకార శాఖ, ఆర్డీవోలు, ఏడీయేలు పర్యవేక్షిస్తారు.

Posted in Uncategorized

Latest Updates