రైతు బీమా సర్వే నేటి నుంచే

farmer-insurenceరైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం రైతు బీమా. ఇవాల్టి(బుధవారం,జూన్-6) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. దాదాపు నెల రోజులపాటు ఈ సర్వే కొనసాగనుంది. పట్టాదారు పాసు పుస్తకం పొందిన, పెట్టుబడి చెక్కులు తీసుకున్న ప్రతి రైతు ఇంటికెళ్లి 18 నుంచి 60 ఏళ్ల వయసున్న వారిని గుర్తిస్తారు. తర్వాత ఆ రైతులకు నామినీ పేపర్లు అందిస్తారు. నామినీ పేపర్లను నింపి రైతు సంతకం చేసిన తర్వాత వాటిని తిరిగి తీసుకుంటారు అధికారులు. నామినీ పత్రాలను అన్నింటినీ సేకరించిన తర్వాత LICకి అప్పగిస్తామన్నారు వ్యవసాయ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ జగన్‌మోహన్‌. ఆగస్టు 15వ తేదీ నుంచి రైతులకు ఎల్‌ఐసీ కింద బీమా వర్తింపజేయనున్నారు.

కొద్ది రొజుల క్రితం ప్రభుత్వం రైతు బంధు పథకం కింద 42.94 లక్షల మందికి పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కులను పంపిణీ చేసింది. కొందరు రైతులు ఇంకా తీసుకోలేదు. మరికొందరికి ఇంకా పట్టాదారు పాసు పుస్తకాల ప్రింటింగ్ జరగలేదు. ఈ క్రమంలో ప్రస్తుత లెక్కల ప్రకారం వ్యవసాయ శాఖ వర్గాలు 42.94 లక్షల మంది రైతుల దగ్గరకే వెళ్లి బీమా కోసం నామినీ పేపర్లు తీసుకుంటారు.  పట్టాదారు పాసు పుస్తకం తీసుకోని వారు…ఇప్పటికీ అందని వారు ఎవరైనా ఉంటే.. వారిని బీమా పరిధిలోకి తీసుకొస్తాన్నారు అధికారులు. అదనంగా వచ్చే రైతుల కోసం మూడు నెలలకోసారి ప్రీమియాన్ని ప్రభుత్వం LICకి చెల్లిస్తుంది. ప్రీమియం సొమ్మును వ్యవసాయ శాఖ కమిషనర్‌ పేరుతో ఆగస్టు ఒకటో తేదీలోపు ఎల్‌ఐసీకి చెల్లించాలి.

Posted in Uncategorized

Latest Updates