రైతు భీమా దేశంలోనే మొదటిసారి : పోచారం

POదేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రైతులకు భీమా కల్పించిందన్నారు వ్యవసాయశాఖమంత్రి పోచారం. రైతుభీమాకు క్యాబినెట్ ఆమోదంపై పొచారం శ్రీనివాస రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భీమాతో రైతుల కుటుంబాలకు దీమా కల్పించిన రాష్ట్ర సీఎం కేసీఆర్ గారికి రాష్ట్ర రైతుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. దురదృష్టవశాత్తు రైతు మరణించినా, ఆ రైతు కుటుంబంకు వచ్చే రూ. 5 లక్షల భీమాతో ఆర్ధిక దన్ను ఉంటుంది. రైతుల కష్టాలు, కన్నీళ్లు తుడచడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలోనే మెుదటిసారిగా రాష్ట్ర రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు ద్వారా ఎకరాకు రూ. 8 వేలను అందిస్తున్నారన్నారు.

Posted in Uncategorized

Latest Updates