రైతు రాజు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : హరీష్

రైతే రాజు కావాలన్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు. ఆదివారం (జూలై-29) సిద్దిపేట జిల్లా, మిర్దొడ్డి మండలం అందే గ్రామంలో 33 11కేవీ సబ్‌ స్టేషన్‌ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఏడాదిలోగా కాళేశ్వరం నీళ్లు దుబ్బాక నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాయన్నారు. రైతు బంధు ద్వారా ఎకరాకు రూ.8వేల పెట్టుబడి ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రైతులకు 24 గంటల కరెంట్ అందిస్తున్నట్లు వివరించారు. పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తోందని.. రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో 119 గురుకుల పాఠశాలలు సీఎం కేసీఆర్ మంజూరు చేశారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మండలానికో గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రజలే టీఆర్‌ఎస్‌కు హైకమాండ్ అని చెప్పారు మంత్రి హరీష్.

Posted in Uncategorized

Latest Updates