రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్ రెడ్డి

guthaరాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన రైతు సమన్వయ సమితి తొలి ప్రాంతీయ సదస్సులో ఈ ప్రకటన చేశారు సీఎం. గుత్తాకి ఉన్న అనుభవం.. రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. ఆయన సేవలు సంఘాలు వినియోగించుకోవాలన్నారు. వ్యవసాయం రంగంలో ఆయనకు ఎంతో అనుభవం ఉందని… సమితి ద్వారా పలు ప్రయోజనాలు అందే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates