రైలుబండి…పోస్టులు దండి

దేశంలో అత్యధిక ఉద్యోగులున్న ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‍ రైల్వేస్‍. నెట్ వర్క్ పరంగా ప్రపంచంలో 4వ స్థానంలో నిలిచి ఏటా లక్షల ఉద్యోగులను నియమిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, అధిక వేతనాలు, ఉద్యోగ భద్రత, ఆకర్షించే ప్రోత్సాహకాలు, ఉచిత రైలు ప్రయాణం వంటి సదుపాయాలుం డటంతో రైల్వే ఉద్యోగాలంటే యువతలో యమ క్రేజ్. ఇటీవల వెలువడిన అసిస్టెంట్‍ లోకోపైలట్‍,టెక్నీషియన్‍, ట్రాక్ మన్‍, గేట్ న్‍, హెల్పర్‍ వంటి 90 వేల గ్రూప్‍–సి, డి ఖాళీలకు దాదాపు రెండున్నర కోట్ల మంది దరఖాస్తు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. మరి ఈ ఉద్యోగాలకు ఎందుకంత పోటీ? అసలు రైల్వేలో ఏ ఏ పరీక్షలుంటాయి? వాటి అర్హతలు, పరీక్షా విధానాలు…

రైల్వే ఉద్యోగాలను ఎ, బి, సి, డి అనే నాలుగు గ్రూప్ లుగా విభజించారు. వీటిలో గ్రూప్‍–బి తప్ప అన్ని పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్ మెంట్‍ ద్వారా నియామకాలు చేపడుతారు. గ్రూప్‍–ఎ ఉద్యోగాలను యూపీఎస్సీ, సి, డి ఉద్యోగాలను రైల్వే రిక్రూట్ మెంట్‍ బోర్డులు భర్తీ చేస్తాయి. రైల్వే పరీక్షలన్నీ దాదాపు ఆన్ లైన్ లోనే జరగుతున్నాయి. వీటికి ఇంత పోటీ ఉండటానికి ప్రధానం కారణం ఉద్యోగ భద్రత, అధిక వేతనాలు కలిగి ఉండటమే. దీంతో పాటు ఆకట్టుకునే ప్రోత్సాహకాలు, జీవితాంతం కుటుంబం మొత్తానికి రైలు ప్రయాణాలు ఉచితం కావడం వంటివి ఈ క్రేజ్ కు కారణం. అందుకే అత్యధిక పోస్టులను భర్తీ చేస్తున్న సంస్థగా రైల్వే, ఎక్కువ మంది పోటీ పడే జాబ్ లుగా రైల్వే ఉద్యోగాలు నిలుస్తున్నాయి.

గ్రూప్‍–ఎ

ఇందులో క్లాస్‍–I జాబ్ లుంటాయి. అవి ఇండియన్‍ రైల్వే ట్రాఫిక్‍ సర్వీస్‍, అకౌంట్స్ సర్వీస్‍, పర్సనల్‍ సర్వీస్‍, ఆర్ పీఎఫ్‍ అసిస్టెంట్‍ సెక్యూరిటీ కమీషనర్‍. వీటిని యూపీఎస్సీ సివిల్‍ సర్వీసెస్‍ పరీక్ష ద్వారా భర్తీ చేస్తుంది. అలాగే సర్వీస్‍ ఇంజినీర్స్, సివిల్‍, మెకానికల్‍, ఎలక్ట్రికల్‍ అండ్‍ ఎలక్ర్టానిక్స్/టెలి కమ్యూనికేషన్‍, సిగ్నల్‍ ఇంజినీర్స్ వంటి పోస్టులకు ఇదే సంస్థ ఇండియన్‍ ఇంజినీరింగ్‍ సర్వీసెస్‍ ఎగ్జామినేషన్‍ ద్వారా నియామకాలు జరుపుతుంది.

గ్రూప్‍–సి

ఇందులో టెక్నికల్‍, నాన్‍ టెక్నికల్‍ అనే రెండు రకాల జాబ్స్ ఉంటాయి. అసిస్టెంట్‍ లోకో పైలట్‍, టెక్నీషియన్‍ గ్రేడ్‍–II & III, జూనియర్‍ ఇంజినీర్‍ (జేఈ), సీనియర్‍ సెక్షన్‍ ఇంజినీర్‍ (ఎస్‍ఎస్‍ఈ), చీఫ్ డిపోట్‍ మెటీరియల్‍ సూపరింటెండెంట్‍ (సీడీఎంఎస్‍), డిపోట్‍ మెటీరియల్‍ సూపరింటెండెంట్‍ (డీఎంఎస్‍), కెమికల్‍ & మెటలర్జికల్‍ అసిస్టెంట్‍ అనేవి టెక్నికల్‍ పోస్టుల కిందకి వస్తాయి.

టెక్నికల్‍ పోస్టులు

అసిస్టెంట్‍ లోకోపైలట్‍, టెక్నీషియన్‍ పోస్టులకు పదోతరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణత తప్పనిసరి. డిప్లొమా/ఇంజినీరింగ్‍ చేసినవారూ అర్హులే . వీటికి 28 సంవత్సరాల వయసు మించకూడదు. జేఈ, ఎస్‍ఎస్‍ఈ వంటి ఇంజినీర్‍ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో డిప్లొమా/నాలుగేళ్ల ఇంజినీరింగ్‍ డిగ్రీ/బీఎస్సీ/ఎంఎస్సీ చేసిన వారు అర్హులు. జేఈ, డీఎంఎస్‍ పోస్టులకు 18 నుంచి 32 సంవత్సరాలు, మిగిలిన పోస్టులకు 18 నుంచి 34 సంవత్సరాల వయసు ఉండాలి. కంప్యూ టర్‍ బేస్డ్ ఆన్ లైన్ విధానంలో నిర్వహించే ఏఎల్‍పీ, టెక్నీషియన్‍ పరీక్షలో జనరల్‍ అవేర్ నెస్‍ ఆన్‍ కరెంట్‍ ఆఫైర్స్, మ్యాథమెటిక్స్, జనరల్‍ ఇంటెలిజెన్స్ అండ్‍ రీజనింగ్‍, జనరల్‍ సైన్స్ నుంచి 75 ప్రశ్నలు వస్తాయి. సమయం 60 నిమిషాలు. జనరల్‍ అభ్యర్థు లు 40, ఓబీసీ, ఎస్సీలు 30, ఎస్టీలు 25 శాతం మార్కులు సాధిస్తే క్వాలిఫై అవుతారు. వీరికి రెండోదశలో రెండు విభాగాలుగా ఉండే మెయిన్‍ ఎగ్జామ్‍ నిర్వహిస్తారు. ఇందులో పార్ట్–ఎ లో మ్యాథమెటిక్స్, జనరల్‍ ఇంటెలిజెన్స్ అండ్‍ రీజనింగ్‍, బేసిక్‍ సైన్స్ అండ్‍ ఇంజినీరింగ్‍, జనరల్‍ అవేర్ నెస్‍ ఆన్‍ కరెంట్‍ ఆఫైర్స్ అనే సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. సమయం 90 నిమిషాలు. పార్ట్–బి లో సంబంధిత ఇంజినీరింగ్ బ్రాంచ్‍ వారికి ఆయా సబ్జెక్టుల నుంచి 75 ప్రశ్నలు వస్తాయి. డ్యూరేషన్ 60 నిమిషాలు.మొత్తం మీద ఏఎల్‍పీ మెయిన్‍ పరీక్ష 175 మార్కులకు ఉంటుం ది. దీనిలో అర్హత సాధించిన వారిని 1 : 8 నిష్పత్తిలో ఎంపిక చేసి కంప్యూ టర్‍ బేస్డ్ ఆప్టిట్యూడ్‍ టెస్టు నిర్వహిస్తారు.

ఇంజినీరింగ్ విభాగంలో జూనియర్‍ ఇంజినీర్‍ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‍ ఎబిలిటీ నుంచి 60 ప్రశ్నలు, టెక్నికల్‍ ఎబిలిటీ / జనరల్‍ సైన్స్ నుంచి 90 ప్రశ్నలు వస్తాయి. సమయం 2 గంటలు. సీనియర్‍ సెక్షన్‍ ఇంజినీర్‍ పరీక్ష ఆబ్జెక్టి వ్‍ విధానంలో ఉంటుంది. మొత్తం 150 మార్కులకు 150 ప్రశ్నలు వస్తాయి. పరీక్షా సమయం రెం డు గంటలు. రెండు పరీక్షల్లోనూ 1/3వ వంతు రుణాత్మక మార్కులుంటాయి.

నాన్ టెక్నికల్‍

అసిస్టెంట్‍ స్టేషన్‍ మాస్టర్‍, గూడ్స్ గార్డ్, టికెట్‍ కలెక్టర్‍, సీనియర్‍ క్లర్క్, ఎంక్వైరీ కమ్‍ రిజర్వేషన్‍ క్లర్క్, ట్రాఫిక్‍ అప్రెంటీస్‍, కమర్షియల్‍ అప్రెంటీస్‍, సీనియర్‍ టైం కీపర్‍, జూనియర్‍ అకౌంట్స్ అసిస్టెంట్‍ కమ్‍ టైపిస్ట్ వంటి 9 పోస్టులను ఎన్ టీపీసీ పోస్టులు అంటారు. వీటికి ఏదైనా డిగ్రీ చేసినవారు అర్హులు. వయసు 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.ఈ పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు దశల్లో ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. 90 నిమిషాల్లో 100 ప్రశ్నలు రాయాలి. ప్రిలిమ్స్‌‌లో అర్హత సాధించిన వారిలో ఏఎస్‍ఎమ్‍, టీసీ,సీనియర్‍ టైం కీపర్‍, సీనియర్‍ క్లర్క్, జేఏఏ పోస్టులకు పోటీపడే వారికి మాత్రమే 120 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. రెండు దశల్లోనూ 1/3వ వంతు రుణాత్మక మార్కులుంటాయి. మెయిన్స్ లోనూ అర్హత సాధించిన వారికి (కొన్ని పోస్టులకు మాత్రమే) మూడో దశలో టైపింగ్‍ టెస్ట్ లేదా ఆప్టిట్యూడ్‍ టెస్ట్ నిర్వహిస్తారు. టైపింగ్‍ టెస్ట్‌‌లో నిమిషానికి ఇంగ్లిష్‍ అయితే 30 పదాలు, హిందీ అయితే 25 పదాలు కంపోజ్‍ చేయాల్సి ఉంటుంది. గ్రూప్‍–సి లో ఎంపికయిన వారు సర్వీసును బట్టి గ్రూప్‍‌‌–బికి ప్రమోట్‍ అవుతారు.

గ్రూప్‍ –డి

ట్రాక్ మన్‍, గేట్ మన్‍, పాయింట్స్‌‌మన్‍, అసిస్టెంట్‍ పాయింట్స్‌‌మన్‍ హాస్పిటల్‍ అటెండెంట్‍, స్వీపర్‍, హెల్పర్స్, పోర్టర్స్, సపాయివాలా వంటి పోస్టులు ఈ గ్రూప్ లో ఉంటాయి. వీటికి పదోతరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణత సాధించాలి. గతేడాది వరకు రైల్వే రిక్రూట్ మెంట్‍  ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులను ప్రస్తుతం ఆర్‍ఆర్ బీలే నిర్వహిస్తున్నాయి.రాత పరీక్ష, ఫిజికల్‍ ఎఫీషియన్సీ టెస్టు ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులుంటాయి. జనరల్‍ అవేర్ నెస్‍ ఆన్‍ కరెంట్‍ ఆఫైర్స్, మ్యాథమెటిక్స్, జనరల్‍ ఇంటెలిజెన్స్ అండ్‍ రీజనింగ్‍, జనరల్‍ సైన్స్ నుంచి వంద ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి. 1/3 వ వంతు నెగెటివ్‍ మార్కులున్నాయి. రాత పరీక్షలో క్వాలిఫై కావాలంటే జనరల్‍ అభ్యర్థులు 40 శాతం, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ లు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. వీరికి తర్వాతి దశలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో 35 కేజీల బరువు ఎత్తుకొని 2 నిమిషాల్లో 100 మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. ఒక కిలోమీటర్‍ దూరంను 4 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాలి. మహిళలయితే 20 కేజీల బరువుతో 2 నిమిషాల్లో 100 మీటర్లు పరిగెత్తాలి. 5 నిమిషాల 40 సెకన్లలో ఒక కిలోమీటర్‍ రేసు పూర్తి చేయాలి. వీటితో పాటు ఆర్ పీఎఫ్‍/ఆర్ పీఎస్‍ఎఫ్‍, స్పె షల్‍ క్లాస్ రైల్వే అప్రెంటీస్‍ అనే పోస్టుల ద్వారా రైల్వేల్లో చేరొచ్చు. ఇందులో ఆర్ పీఎఫ్‍ పోస్టులను రైల్వే రిక్రూట్ మెంట్‍ బోర్డులు, ఎస్‍సీఆర్‍ఏ పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తాయి.

ఆర్ పీఎఫ్‍ /ఆర్ పీఎస్‍ఎఫ్‍

రైల్వే ప్రొటెక్షన్‍ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్‍ స్పె షల్‍ ఫోర్స్ అనేవి రైల్వే భద్రతా బలగాల నియామకానికి నిర్వహించే పరీక్షలు. వీటిలో ఎస్‌‌ఐ, కానిస్టేబుల్ పోస్టులుంటాయి. కానిస్టేబుల్‍ పరీక్షకు పదోతరగతి అర్హత ఉండాలి. కనీస వయసు 18 సంవత్సరాలు. గరిష్టం 25. ఎస్‍ఐ పోస్టుకు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండి డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ మెజర్‌‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రెండు పరీక్షలకు ఒకే సిలబస్‍ ఉంటుంది. జనరల్‍ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు 35 శాతం కాగా ఎస్‌‌సీ , ఎస్‌‌టీ కేటగిరీల అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి. ఇందులో క్వాలిఫై అయిన వారికి పీఈటీ, పీఎంటీ నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం మార్కులు 120 కాగా జనరల్‍ అవేర్ నెస్‍ కు 50, ఆరిథ్ మెటిక్‍,రీజనింగ్‍ లకు 35 మార్కుల చొప్పున కేటాయించారు. సమయం 90 నిమిషాలు.

 

Posted in Uncategorized

Latest Updates