రైలులోనే ప్రసవం..పండంటి కవలలు పుట్టారు

కదులుతున్న రైలులోనే పండంటి కవలలకు జన్మనిచ్చింది ఓ మహిళా. ఈ సంఘటన ఆదివారం (జూలై-15) జరిగింది. మహారాష్ట్రలోని ఘట్కోపర్‌ కు చెందిన నిండు గర్భిణి.. LTT- విశాఖపట్నం ఎక్స్‎ప్రెస్ రైల్లో ప్రయాణించారు. ట్రైన్‎ కల్యాణ్ ‎నగర్ ‎‎కు చేరుకునే సమయంలో ఆమెకు నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె అక్కడే ప్రసవించారు. ఇద్దరు పండంటి కవలలు (ఆడ,మగ) జన్మిచ్చారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారు.ట్రైన్ LTT ముంబై (లోకమన్య తిలక్ టెర్మినల్)నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ప్రసవం జరిగిందని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు ట్రైన్ డ్యూటీలో ఉన్న పోలీసులు. మహిళకు నొప్పులు వస్తున్న క్రమంలో తోటి ప్రయాణికులు సహాయం చేసినట్లు చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates