రైలులో మేక.. టికెట్ డబ్బుల కోసం వేలం

ముంబై మస్జిద్ రైల్వేస్టేషన్ లో ఓ వెరైటీ సంఘటన జరిగింది. టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేస్తున్న ఓ  ప్రయాణికురాలని వేలం వేశారు రైల్వే అధికారులు. మంగళవారం(జులై-31)న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మంగళవారం(జులై-31) సాయంత్రం 4 గంటల సమయంలో ఓ వ్యక్తి తన మేకతో కలసి లోకల్ ట్రైన్ లో జర్నీ చేస్తున్నాడు. మస్జిద్ స్టేషన్ లో దిగిన సమయంలో ఫ్లాట్ ఫాంపై మేకతో వస్తున్న ఆ వ్యక్తిని.. రైల్వే టీసీ రామ్ కప్టే టిక్కెట్ చూపించమని అడిగాడు. టిక్కెట్టు తీసుకోకుండా ప్రయాణం చేస్తున్న ఆ వ్యక్తి భయపడ్డాడు. తన మేకను అక్కడే వదిలేసి.. గుంపులోకి దూరిపోయి తప్పించుకున్నాడు.

ఇండియన్ రైల్వే యాక్ట్ ప్రకారం.. రైల్వే ఆవరణలోగానీ, రైలులోపల గానీ జంతువులు ప్రయాణించడానికి అనుమతి లేదు. దీంతో రైల్వే అధికారులు రూల్స్ ప్రకారం.. దీనిని ఎవరూ తనదిగా క్లెయిమ్ చేసుకోకపోవడంతో..  బుధవారం ఆ మేకను వేలం వేశారు. 3 వేల రూపాయల ఫ్లకార్డ్ తో వేలం నిర్వహించారు. 2 వేల500 రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ మేకకు పేరు కూడా పెట్టారండీ.. ఏంటో తెలుసా బసంతి..

Posted in Uncategorized

Latest Updates