రైలు ఢీకొని ఇంజినీర్ మృతి : ఓ చేతిలో ఫోన్.. మరో చేతితో చాటింగ్

poiచుట్టుపక్కల ప్రపంచాన్ని మరచిపోయాడు. ఓ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. మరో చేతిలోని ఫోన్ లో చాటింగ్ చేస్తున్నాడు. అలా నడుచుకుంటూ రైలు పట్టాలపైకి వెళ్లాడు. ముందూ వెనకా ఏం జరుగుతుందో కూడా గమనించకుండా ఫోన్లలో లీనం అయిపోయాడు. స్పీడ్ వస్తున్న రైలు కింద పడి చనిపోయాడు ఓ సాఫ్ట్ వేర్ యువకుడు. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఈ యువకుడు శ్మాశానికి వెళ్లాడు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షెహంజాపూర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్ కి చెందిన నరేష్ పాల్ గంగ్వార్(30) నోయిడాలోని సుజికీ బిల్డర్స్ లో సివిల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ఆదివారం (ఫిబ్రవరి18) సాయంత్రం నరేష్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. దీంతో నరేష్ స్వగ్రామం నండోసికి వచ్చాడు.

ఆదివారం సాయంత్రం నరేష్ పెళ్లి కావటంతో కుటుంబ సభ్యులు, బంధువులు హడావిడిగా ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో మిత్రుడి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఫోన్ మాట్లాడుతూ ఇంటి దగ్గర్లోని రైల్వే ట్రాక్ దగ్గరకు అలా వెళ్లిపోయాడు. మరో ఫోన్ లో చాటింగ్ చేస్తున్నాడు. అలా రైల్వే ట్రాక్ పై మాట్లాడుతూ నడుస్తున్నాడు. తన దృష్టి అంతా ఫోన్లపై పెట్టిన నరేష్.. వెనుక నుంచి వస్తున్న రైలు (రాజ్యరాణి ఎక్స్ ప్రెస్)ని గమనించలేదు. దీంతో రైలు ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. నరేష్ మృతి విషయం తెలియగానే కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. పెళ్లికి వచ్చిన బంధువులు చివరి చూపు చూశారు.

Posted in Uncategorized

Latest Updates