రైలు ఫుట్ బోర్డ్ పై జర్నీ : కరెంట్ పోల్ ఢీకొని నలుగురి మృతి

లోకల్‌ ట్రైన్‌ ప్రయాణంలో ఘోరం జరిగింది. ఫుట్‌బోర్డు ప్రయాణం నలుగురి ప్రాణాలు తీసింది. ఈ ఘటన మంగళవారం (జూలై-24) ఉదయం చెన్నై సెయింట్‌ థామస్‌ మౌంట్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో చెన్నై బీచ్‌-తిరుమాల్‌పూర్‌ లోకల్‌ రైలులో జరిగింది. ట్రైన్ రష్ గా ఉండటంతో కొంత మంది ప్రయాణికులు ఫుడ్ బోర్డుపై నిల్చుని ప్రయాణిస్తున్నారు. సెయింట్‌ థామస్‌ మౌంట్‌ రైల్వేస్టేషన్‌ రైల్వే స్టేషన్ దగ్గరకు వస్తుండగానే కరెంట్ పోల్ ఢీ కొట్టడంతో ఫుట్ బోర్టుపై ఉన్న ప్రయాణికులు కిందపడిపోయారు. ఇందులో నలుగురు అక్కడి కక్కడే చనిపోగా… మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తలించారు రైల్వే అధికారులు.

ఇది ఎక్కవగా బిజినెస్ ఏరియా కావడంతో పాటు పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో రోజు ఎక్కువ సంఖ్యలో జనం ఇక్కడికి వస్తుంటారు. ఎక్కువగా లోకల్ ట్రైన్ లో రావడంతో….అన్ని ట్రైన్స్ అన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి వస్తుంటాయి.

Posted in Uncategorized

Latest Updates