రైల్వేయార్డ్ లో అగ్నిప్రమాదం.. షోలాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

train-fireముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ రైల్వే యార్డులో అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే యార్డులో నిలిపివున్న షోలాపూర్ ఎక్స్ ప్రెస్ లో రైల్ లోని ఓ బోగీ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

ఈ ఘటన మంగళవారం(మే-29) మధ్యాహ్నం జరిగింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది అలర్టయ్యారు. యార్డ్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది  చేరుకుని మంటలను అదుపు చేశారు.

రైలులో అగ్నిప్రమాదం జరిగిందన్న వార్త తెలియడంతో ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు…ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

 

Posted in Uncategorized

Latest Updates