రైల్వేలో ఉద్యోగాల కూత : మరో 20 వేల పోస్టులకు గ్రీన్ సిగ్నల్

RRPరైల్వేశాఖలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. కొన్ని రోజుల క్రితం 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే శాఖ ఇప్పుడు అదనంగా మరో 20,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు గురువారం(మార్చి29) రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ గురువారం తెలిపారు. దీంతో భర్తీ కానున్న మొత్తం ఉద్యోగాల సంఖ్య 1.10 లక్షలకు చేరుతుందన్నారు గోయల్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన భర్తీ ప్రక్రియ మరింత విస్తృతమయిందంటూ గోయల్ గోయల్‌ ట్వీట్‌ చేశారు. కొత్తగా ప్రకటించిన ఉద్యోగాల్లో రైల్వే పోలీస్‌ ఫోర్స్‌(RPF), రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌(RPSF)కు సంబంధించి 9 వేల పోస్టులు ఉన్నట్లు ఆయన తెలిపారు. మే నెలలో వీటి భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని పియూష్ గోయల్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates