రైల్వేలో 26,505 ఉద్యోగాలకు నోటిఫికేషన్

indin ralwayఇండియన్ రైల్వే అసిస్టెంట్ లోకో పైల‌ట్‌, టెక్నీషియ‌న్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్ల పరిధిలోని 26,505 అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టులను భర్తీచేస్తారు. ఈ నోటిఫికేషన్‌లో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌కు 3262 పోస్టులను కేటాయించారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దక్షిణ రైల్వే, తూర్పు కోస్తా రైల్వే, దక్షిణ మధ్య రైల్వే జోన్‌ల పరిధిలోని పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.45 వేల వరకు వేతనం లభిస్తుంది.

అసిస్టెంట్ లోకో పైల‌ట్‌: 17676
టెక్నీషియ‌న్: 8829
మొత్తం పోస్టుల సంఖ్య: 26,502
విభాగాలు: అర్మేచర్ కాయిల్ వైండర్, బ్లాక్‌స్మిత్, బుక్ బైండర్, కార్పెంటర్, క్రేన్ డ్రైవర్, డీజిల్ మెకానిక్, మెషీనిస్ట్, పెయింటర్, షీట్ మెటల్ వర్కర్, పంప్ ఆపరేటర్, రిగ్గర్, ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్ మెకానిక్, వెల్డర్, ఫిట్టర్, మల్టీస్కిల్డ్ ఫిట్టర్.
విద్యార్హత‌లు : ప‌దోత‌ర‌గ‌తితోపాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ అప్రెంటీస్‌షిప్ లేదా మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్/ సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Posted in Uncategorized

Latest Updates