రైల్వేశాఖ బంపరాఫర్ : ఆధార్ లింక్ చేస్తే రూ.10వేలు

RAILరైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది IRCTC (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్). యూజర్లు తమ ఆధార్ కార్డు నెంబర్ ను IRCTC అకౌంట్‌ తో లింక్‌ చేస్తే  10వేల రూపాయల క్యాష్ ఫ్రైజ్ అందించనున్నట్టు తెలిపింది. IRCTC అకౌంట్‌ తో ఆధార్‌ లింక్‌ చేసుకుని ట్రైన్‌లో ప్రయాణించిన యూజర్లు ఈ లక్కీ డ్రా స్కీమ్‌ కి అర్హులని తెలిపింది. జూన్ 2018 వరకూ ఈ లక్కీ డ్రా స్కీమ్ అందుబాటులో ఉంటుంది.

ప్రతి నెలా లక్కీ డ్రా ఉంటుంది. ముందు నెలలో ప్రయాణించిన 5 మంది లక్కీ ప్రయాణికులను, తర్వాత నెల రెండో వారంలో కంప్యూటరైజ్డ్‌ ర్యాండమ్‌ లక్కీ డ్రా ప్రాసెస్‌ ద్వారా ఎంపిక చేసి వారికి ఈ క్యాష్ ఫ్రైజ్ అందిస్తారు. ఈ క్యాష్ ఫ్రైజ్ తో పాటు, రైల్‌ టిక్కెట్‌ ఎమోంట్ కూడా రీఫండ్‌ చేస్తారు. PNR (ప్యాసింజర్‌ నేమ్‌ రికార్డు) ఆధార్‌ ఆధారితంగా బుక్‌ చేసుకున్న యూజర్లకు మాత్రమే ఈ లక్కీ డ్రా స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది. ఒక యూజర్‌ ఒకటి కంటే ఎక్కువ PNRలు కలిగి ఉంటే, కేవలం ఒక్క PNRను మాత్రమే సెలక్ట్ చేస్తారు. క్యాష్ ఫ్రైజ్ గెల్చుకున్న విన్నర్ల పేర్లను తరువాతి నెలలో తన వెబ్‌సైట్‌ లో IRCTC తెలుపుతుంది. అయితే IRCTC ఉద్యోగులు మాత్రం ఈ లక్కీ డ్రా స్కీమ్ కు అర్హులు కాదు.

Posted in Uncategorized

Latest Updates