రైల్వేహెచ్చరిక: పట్టాలపై సెల్ఫీ దిగితే జైలుకే

selfie-trainచేతిలో స్మార్ట్ ఫోస్… ఫ్రెండ్స్ కలిస్తే చాలు..సమయం..సందర్భం అవసరం లేదు సెల్ఫీలతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అది కాస్తా మితిమీరి పోతోంది.  సెల్ఫీలు దిగుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. రైలు పట్టాలపై నిలబడి సెల్ఫీ తీసుకోవడం.. స్పీడ్ గా వస్తున్న ట్రైన్‌ పక్కన నిలబడి సెల్ఫీ తీసుకోవడం క్రేజీగా భావిస్తున్నారు. అయితే మీరు జైలుకు వెళ్లకు తప్పదు. రైళ్లు, రైల్వే స్టేషన్లు, బోగీలపై నించొని సెల్ఫీలు తీసుకొనే సెల్ఫీరాయుళ్లను కట్టడి చేసేందుకు రైల్వే పోలీసులు చర్యలు చేపట్టారు. రైల్వే చట్టాలకు పదును పెడుతున్నారు. అక్రమంగా పట్టాలు దాటే వారిని, సెల్ఫీలు దిగేవారిని కట్టడి చేసేందకు జైలు శిక్ష విధించేలా కేసులు నమోదు చేయడమే సరైన చర్య అంటున్నారు రైల్వే పోలీస్‌ ఉన్నతాధికారులు.

రైల్వే చట్టం 147 ప్రకారం రూ.500 నుంచి రూ.1,000 వరకు జరిమానా విధించడంతో పాటు 6 నెలల జైలూ విధించే అవకాశం ఉన్నా చాలా వరకు జరిమానాలకే పరిమితమవుతున్నారు. ఇక నుంచి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు రైల్వే పోలీస్‌ డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

రైల్వే ట్రాక్ పై చనిపోయిన తర్వాత బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వడం కంటే అసలు ప్రమాదాలే జరగకుండా చర్యలు తీసుకోవడం మంచిదని రైల్వే పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates