రైల్వే ఈ-టికెట్ పాసింజర్స్ కు గుడ్ న్యూస్

రైల్వే ఈ- టికెట్ పాసింజర్స్ కు IRCTC గుడ్ న్యూస్ చెప్పింది. ఐఆర్ టిసి నిబంధనల ప్రకారం ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి 24 గంటల ముందు పాసింజర్స్ తమ పేరును మార్పు చేసుకోవచ్చని ప్రకటించింది. టికెట్ లో పేరు మార్పు చేయాలనుకునే పాసింజర్… తమ దగ్గర ఉన్నఈ-టికెట్ తో దగ్గర్లోని రైల్వే రిజర్వేషన్ ఆఫీస్ కు వెళ్లాలి.

ఆ టికెట్ తో ఎవరు ప్రయాణించాలనుకుంటున్నారో వారి ఐడెంటిటీ కార్డ్ ను అక్కడి సిబ్బందికి ఇవ్వాలి. దీంతో వారు ప్రయాణికుడి పేరును మారుస్తారు. పాసింజర్ ఆ టికెట్ ను తమ కుటుంబంలోని వ్యక్తులైన తల్లి,తండ్రి,సోదరులు,అక్కా చెల్లెళ్లు,కొడుకు,కూతురు,భర్త,భార్య పేరుకు మార్చుకోవచ్చు.

Posted in Uncategorized

Latest Updates