రైల్వే ఉద్యోగులకు దసరా పండగ శుభవార్త

దసరా పండగ సందర్భంగా రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కూడా 78 రోజులకు బోనస్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి రైల్వే ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్‌ బోనస్‌ (PLB) 78 రోజులకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చినట్లు తెలిపిందన్నారు కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌. నాన్‌ గెజిట్‌ రైల్వే ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్‌ లభించనుంది. దీని కింద ఉద్యోగులు తమ వేతనంతో పాటు సుమారు రూ.18వేలు అదనంగా బోనస్‌ కింద పొందనున్నారు.

PLB బోనస్‌ కింద సుమారు 12.26లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(RPF), రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌(RPSF) ఉద్యోగులకు ఇది వర్తించదు. ఈ బోనస్‌ తో దాదాపు రూ.2వేల కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుంది. గత ఆరేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు దసరా సందర్భంగా 78రోజుల PLB ని బోనస్‌గా ఇస్తోంది.

Posted in Uncategorized

Latest Updates