రైల్వే కేటరింగ్ లో ఘోరం : కాళ్లతో తొక్కుతూ ఆలూ కర్రీ

potato-indian-railwayఇండియన్ రైల్వే. ప్రపంచంలోనే పెద్దది. అందులో ఫుడ్ మాత్రం ప్రపంచంలోనే వరస్ట్ అంటారు. పందులు కూడా ఈ ఫుడ్ తీసుకోవు అంటూ ఎన్నో కామెంట్స్. టేస్ట్ ఉండదు.. నాణ్యత అస్సలు ఉండదు.. అనేది చాలా సార్లు నిజం అయ్యింది. అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇటీవల విడుదల అయిన వీడియో నిరూపించింది. రైలు కేటగిరి బోగీలోని సిబ్బంది.. ఓ పెద్ద గిన్నెలోని ఆలూలను కాళ్లతో తొక్కుతున్న వీడియోతో ప్రయాణికులు షాక్ అవుతున్నారు.

అహ్మదాబాద్ టూ హౌరా వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలులో ఫుడ్ అందించే ప్యాంట్రీ కార్ ఉంది. అందులో ప్రయాణికులకు కావాల్సిన ఆహార పదార్థాలు తయారు అవుతాయి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి భోజనం తయారు అవుతుంది. ముందుగానే ఆర్డర్స్ తీసుకుని ఆ టైంకి అందిస్తారు. ప్యాంటీ కార్ లోని సిబ్బంది ఓ పెద్ద గిన్నెలోని ఆలూ (ఉల్లగడ్డలను) తొక్కుతూ కనిపించాడు. కర్రీ చేయటం కోసం.. ఆలూని పేస్ట్ చేయటంలో భాగంగా ఇలా కాళ్లతో తొక్కుతున్న ఘటనను ఫ్లాట్ ఫాం నుంచి వీడియో తీశాడు ఓ ప్రయాణికుడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే అందరూ షాక్. ఇంత దరిద్రంగా ఆహార పదార్థాలను తయారు చేస్తారా రైలులో అంటూ నోరెళ్లబెట్టారు. సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates