రైల్వే బడ్జెట్: తెలుగు రాష్ట్రాలకు తగిన స్థాయిలోనే నిధులు

VINODకేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో …గతంతో పోలిస్తే ఈసారి తెలుగు రాష్ట్రాలకు నిధులు చెప్పుకోదగిన స్థాయిలోనే పెరిగాయన్నారు రైల్వే జీఎం వినోద్ కుమార్. ప్రయాణికుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, కొత్త లైన్ల సర్వేకు ఈసారి ఎక్కువ ప్రాధాన్యం కల్పించామన్నారు.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట, గుల్బార్గా లైన్ మినహాయిస్తే మిగతా లైన్లన్నీ విద్యుదీకరణ చేసేందుకు 11వందల 72 కోట్లు కేటాయింపులు చేశామనీ, మూడున్నరేళ్లలో  ఈ మొత్తం పూర్తి చేస్తామన్నారు. అలాగే కొత్త లైన్లకోసం 1757.70 కోట్లు, దక్షిణ మధ్య రైల్వేలో డబ్లింగ్  కోసం 1753.62 కోట్లు, ట్రాఫిక్ సదుపాయాలకు 210.77 కోట్లు, మౌలాలి  ఫ్లాష్ బటన్ వెల్డింగ్ యూనిట్ అభివృద్ధికి 7. 71కోట్లు, పెద్దపల్లి జగిత్యాల విద్యుదీకరణకు 33కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు చెప్పారు.

కొత్తగా  పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి- జోగి పేట మీదుగా మెదక్ వరకూ 95 కిలోమీటర్లు రైల్వే లైన్, నిర్మల్ మీదుగా నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ 125  కిలోమీటర్లు, మానకొండూర్ నుంచి ఎల్కతుర్తి మీదుగా హుజురాబాద్ వరకు 60 కిలోమీటర్ల లైన్ల సర్వేకు అనుమతులిచ్చారు. అలాగే బైపాస్ లైన్లకు సంబంధించి పెద్దపల్లి-ఖాజీపేట, ఖానాపూర్ – పర్లి, వికారాబాద్  – వాడి, పగిడిపల్లి నుంచి భువనగిరి మీదుగా శంకర్ పల్లి, విష్ణుపురం – జాన్ పహాడ్, నిజామాబాద్ నుంచి ముద్కేడ్ మీదుగా పర్బనీ లిస్టులో ఉన్నాయి.  మనోహరాబాద్-కొత్తపల్లి 125కోట్లు , మునిరాబాద్ – మహబూబ్ నగర్ లకు  275 కోట్లు, అక్కన్నపేట-మెదక్ 120 కోట్లు, భద్రాచలం-సత్తుపల్లి 120 కోట్లు, ఖాజీపేట్ – బల్లార్షా మూడవ లైన్ కొరకు 301కోట్లు,   సికింద్రాబాద్.. మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులకు 259 కోట్లు, ఖాజీపేట.. విజయవాడ మూడవ లైన్ కోసం 60 కోట్ల నిధులిచ్చారు.

ప్రస్తుతం ఘట్కేసర్ వరకు ఉన్న MMTS ను ఫేజ్ 2 కింద యాదాద్రి వరకు విస్తరిస్తామన్నారు. 21 కోట్ల ఖర్చుతో 2018 డిసెంబర్ లోపే పూర్తి చేస్తామన్నారు. అలాగే చర్లపల్లిలో శాటిలైట్ టర్మినల్ అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు కేటాయించామనీ, తెలంగాణ ప్రభుత్వం ఇంకాస్త భూమిని సేకరించి ఇస్తే దాన్ని మరింత విస్తరిస్తామన్నారు . అన్ని రైల్వే జోన్ లు, రైళ్లలో సీసీటీవీలు, వైఫై సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

Posted in Uncategorized

Latest Updates