రైల్వే శాఖ ఆఫర్ : మీ ఐడియాలకు లక్షల నజరానా

indiaభారతీయ రైల్వే ఓ సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. ఒక్క ఐడియా మిమ్మల్ని లక్షాధికారిగా మార్చేస్తుంది అంటోంది భారతీయ రైల్వే. ఒక్క ఐడియా చెబితే 10 లక్షలు ఇస్తామంటుంది.

తన సేవలను మెరుగుపరుచుకునేందుకు ప్రజల నుంచి సలహాలను సేకరించేందుకు సిద్దమైంది భారతీయ రైల్వే . ఆదాయాన్నిపెంచుకోవడానికి ఒక ఐడియా చెప్పమంటూ ప్రజలను కోరుతుంది.  ది బెస్ట్‌ ఐడియా ఇచ్చినవారికి 10 లక్షలు, రెండో ఐడియాకు 5లక్షలు, మూడో ఐడియాకు రూ.3లక్షలు, నాలుగో ఐడియాకు 1 లక్ష రూపాయల వరకూ ఇస్తామని భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది.  మెరుగైన సేవలు అందించి ఎక్కువ ఆదాయం గడించడం ఎలా అనే ఆలోచనతో భారతీయ రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకొంది. సలహాలివ్వాలనుకొనేవారు https://innovate.mygov.in/jan-bhagidari. అనే వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు చూడవచ్చని, దీనికి చివరి తేదీగా 2018, మే 19 నిర్ణయించామని అధికారులు తెలిపారు. అయితే ఈ పోటీ మొత్తం మూడు దశల్లో ఉంటుంది. మొత్తం 1000 పదాలలో మీ సలహా ఇస్తే సరిపోతుంది

Posted in Uncategorized

Latest Updates