రైళ్లలో ఆ సీట్లు ముందుగా మహిళలకే

ొిలుయభారతీయ రైల్వే శాఖ మహిళా ప్రయాణికులకు శుభవార్త అందించింది. నిరుపయోగ (అన్‌యుటిలైజ్డ్‌) బెర్తులు సీట్ల విషయంలో మహిళా కోటాను అమలు చేయాలని నిర్ణయించింది.  సాధారణంగా రైల్వే శాఖ రిజర్వేషన్‌ ఛార్ట్‌ తయారు చేసే సమయంలో సీట్లు మిగిలిపోతే వెయిట్‌-లిస్ట్‌లో ఉన్నవారికి కేటాయిస్తుంది. కోటా ప్రకారం ఫస్ట్ ప్రయార్టీ సీనియర్‌ సిటిజన్లకు.. తర్వాతి ప్రాధాన్యం ముందుగా ఎవరు బుక్‌ చేసుకుంటే వారికి ఉంటుంది. అయితే ఇకపై ఆ లిస్టులో ముందుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 15న రైల్వే బోర్డు ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. బెర్తులు మిగిలిపోయే సమయంలో  సీట్ల కేటాయింపును లింగ నిష్పత్తి ద్వారానే కేటాయించాలని సర్క్యులర్‌లో తెలిపింది. ముందు వృద్ధులకు, తర్వాత మహిళలకు సీట్లు కేటాయించాలి. ప్రస్తుతం అన్ని రైళ్లలో ఆరు లోయర్‌ బెర్తులు, ఏసీ3 టైర్‌, ఏసీ2 టైర్‌ లలో మూడు లోయర్‌ బెర్తులను సీనియర్‌సిటిజన్లు, మహిళా ప్రయాణికులు (45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే), గర్భవతులకు కేటాయిస్తున్నారు. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకు రానుంది రైల్వేశాఖ.

Posted in Uncategorized

Latest Updates