రైళ్లు ఆలస్యంగా నడిస్తే అధికారులపై వేటు : పిీయూష్ గోయల్

trainరైల్వే ప్రయాణికులకు ఊరట కలిగించే వార్త చెప్పింది కేంద్రం. ఇకపై రైళ్లు ఆలస్యంగా వస్తే సంబంధిత స్టేషన్ సిబ్బందిపై వేటు పడుతుందన్నారు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌. ఖచ్చితమైన సమయానికి రైళ్లు రావడం లేదని, ఒక్కొసారి ఒక రోజు రావాల్సిన రైలు మరొక రోజు వస్తుందని, చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. సరైన సమయానికి రైళ్లు నడపి రైల్వేశాఖ చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు. జూన్‌- 30 లోపు పరిస్థితి మారకపోతే ఆయా రైల్వే స్టేషన్ల జీఎంలకు ప్రమోషన్లు ఇవ్వమని, కఠిన చర్యలకు వెనకాడబోమని గోయల్ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates