రైళ్లో వచ్చి వెళ్లారు : చైనాలో కిమ్ రహస్య పర్యటన

KIMఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చైనాలో పర్యటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సోమవారం (మార్చి-26) కిమ్‌ సీక్రెట్ గా చైనాలో పర్యటించాడని ప్రపంచ వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. అది కూడా ఓ రైలులో వచ్చి వెళ్లినట్లు చెబుతున్నారు. ఉత్తర కొరియా ప్రభుత్వం అధికారికంగా ఉపయోగించే రైలుకి పసుపు రంగు బోర్డర్ ఉంటుంది. ఆ రైలు.. చైనాలోని బీజింగ్ రైల్వేస్టేషన్ లో ఆగింది. ఆ తర్వాత రైల్వేస్టేషన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ కాన్వాయ్ కూడా వెళ్లింది. ఆ తర్వాత బీజింగ్‌లోని ప్రముఖ హోటల్‌ దగ్గర భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. మీడియాను, సామాన్యులను రెండు కిలోమీటర్ల దూరం ఉంచారు. ఈ పరిణామాలు అన్నీ కూడా కిమ్ చైనా పర్యటనకి వచ్చారనటానికి బలం చేకూర్చుతుంది అంటున్నారు విశ్లేషకులు. అంతే కాకుండా చైనా – నార్త్‌ కొరియా బార్డర్‌లో బలగాలను మోహరించడం కూడా విశేషం. కిమ్‌ ఎవరితో భేటీ అయ్యారు.. ఏయే అంశాలపై చర్చించారు అనేది ఆసక్తిగా మారింది.

దీనిపై చైనా, ఉత్తర కొరియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ కిమ్‌ చైనా పర్యటన నిజమైతే 2011లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయన మొదటి విదేశీ పర్యటన ఇదే. అమెరికా – ఉత్తర కొరియా మధ్య న్యూక్లియర్‌ క్షిపణుల అంశంలో వివాదం నడుస్తోంది. అమెరికాకి ఏకంగా వార్నింగ్ కూడా ఇచ్చాడు కిమ్. ఈ క్రమంలో కిమ్‌ చైనా పర్యటనపై వార్తలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఉత్తర కొరియా.. చైనాకి ఎప్పటి నుంచో మిత్రదేశంగా ఉంది.

Posted in Uncategorized

Latest Updates