రైళ్ళలో CCTVలు

traincctvరైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు…భద్రత కల్పించేందుకు కూడా చర్యలు చేపట్టింది రైల్వేశాఖ.ప్రయాణికులకు రక్షణ కల్పించడంతో పాటు..వారి లగేజీలు చోరీలకు గురి కాకుండా రైళ్లలో CCTV కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముందుగా శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్ళలోని బోగీల్లో నాలుగు చొప్పున సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు అధికారులు. ఎంట్రీ గేట్ల దగ్గర  రెండు, కారిడార్‌లో మరో రెండు CCTVలు అమర్చనున్నారు. రాజధానిలో 23 బోగీలు, శతాబ్దిలోని 26, దురంతోలోని 18 బోగీలకు ఈ సదుపాయాన్ని కల్పించనున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్‌లో రైల్వేల భద్రతకు ప్రాధాన్యం కల్పిస్తూ రైల్వేశాఖకు రూ.1,46,500కోట్లు కేటాయించింది కేంద్ర సర్కారు.

Posted in Uncategorized

Latest Updates