రొటొమాక్ 4వేల కోట్ల స్కాం : విక్రమ్, రాహుల్ కొఠారీ అరెస్ట్

VIKRAMరొటొమాక్ బ్యాంక్ స్కామ్ కేసులో విక్రమ్ కొఠారీని అతని కొడుకు రాహుల్ కొఠారీని అరెస్ట్ చేశారు అధికారులు. బ్యాంక్ అఫ్ బరోడా ఫిర్యాదుతో నాలుగు రోజుల పాటు కొఠారీ అండ్ కోను విచారించి… ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వివిధ బ్యాంకుల నుంచి మొత్తం 2 వేల 919 కోట్లు లోన్ల రూపంలో అప్పు తీస్కుంది విక్రమ్ ఫ్యామిలీ. వడ్డీతో కలిపి 3 వేల 695 కోట్ల దాకా బకాయి పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఇది బ్యాంకులను మోసం చేసిన కేసు కాదని.. లోన్ డిఫాల్ట్ కేసని.. అనవసర రాద్ధాంతం చేయటం వల్లే ఎక్కువ డ్యామేజ్ జరిగిందన్నారు విక్రమ్ కొఠారి తరఫు లాయర్. బ్యాంకులను మోసం చేసే ఉద్దేశమే ఉంటే కొఠారీ దేశం దాటి ఎందుకు పోలేదని ప్రశ్నించారు.

Posted in Uncategorized

Latest Updates