రోగులను డాక్టర్లు మోసం చేయకూడదు : బూర

BOORAవైద్యవృత్తిలో  ఉన్నవారు  రోగులను  మోసం చేయకుండా …సేవలు  అందించాలని  సూచించారు  ఎంపీ  బూర నర్సయ్యగౌడ్.  హైదరాబాద్ లో  ఇండియన్  మెడికల్  అసోసియేషన్  ఆధ్వర్యంలో  జరిగిన  వరల్డ్  డాక్టర్స్ డే  సెలెబ్రేషన్స్ లో  ఆయన  పాల్గొన్నారు.  ప్రతీ ఒక్కరూ  ఆరోగ్య సూత్రాలు  పాటిస్తూ… సమస్యలు  వచ్చిన వెంటనే  ట్రీట్ మెంట్  చేయించుకోవాలని  బూర నర్సయ్యగౌడ్  సూచించారు. డాక్టర్స్ డే  సందర్భంగా ప్రజలకు  సేవలు  అందించిన  సీనియర్  వైద్యులను  ఆయన సన్మానించారు.

ఈ కార్యక్రమంలో  IPS  పూర్ణచంద్రరావు,  ఇండియన్  మెడికల్  అసోసియేషన్  ప్రెసిడెంట్ సత్యనారాయణ  పాల్గొన్నారు.

Posted in Uncategorized

Latest Updates