వింటర్ ఫ్రూట్… రేగుపండ్లతో సర్ది, దగ్గు దూరం

రేగు పండ్లంటే ఇష్టపడని వాళ్లుండరు. విటమిన్ ఏ, సీలు పుష్కలంగా ఉండే పండ్లు ఇవి. ఈ సీజన్ లో దొరికే “ప్లమ్స్” ఆరోగ్యానికి చాలా మంచివి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో రేగుపండ్లు బాగా ఉపయోగపడతాయి. కంటి చూపు పెరుగుతాయి. సర్ది, దగ్గు చలికాలంలో పిల్లలు, పెద్దలను బాగా ఇబ్బందిపెడుతుంటాయి. వాటికి చక్కటి ఔషధంగా రేగుపండ్లు ఉపయోగపడతాయి.

బలహీనంగా ఉన్నవాళ్లకు రేగు పండ్లు దివ్యౌషధం. రేగు పండ్లు తింటే.. ఎముకల్లో బలం పెరుగుతుంది. చర్మం మెరుస్తుంది. ఫైబర్ ఉన్న ఫుడ్ తింటే లావు అయ్యే అవకాశం ఉండదు. అలా.. రేగుపండ్లను ఆహారంలో భాగంగా తీసుకుంటే బాడీ వెయిడ్ కంట్రోల్ లో ఉంటుంది. రేగుపండ్లలో ఉండే విటమిన్ సి కారణంగా.. రక్తంలో చెడు కొవ్వు తగ్గి.. రక్త ప్రసరణ వ్యవస్థ హెల్దీగా ఉంటుంది. రేగుపండ్లను రక్తం తక్కువగా ఉన్నవారు కూడా తినాలి. పండ్లలోని ఐరన్.. వారిలో ఎనీమియా సమస్యను దూరం చేస్తుంది. అలా అని ఏదీ అతిగా తినకూడదు. రేగుపండ్లను పరిమితంగా తీసుకుంటే చలికాలం ఎదురయ్యే చాలా సమస్యలు దూరం అవుతాయి.

Posted in Uncategorized

Latest Updates