రోజుకొకటి పెట్టుకున్నా 27 సంవత్సరాలు : నీరవ్ ఇంట్లో 10వేల విదేశీ వాచీలు

nirav-modi-watchesపంజాబ్ నేషనల్ బ్యాంక్ కు 11వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ దర్జా జీవితం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది. ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్న అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు కనిపిస్తున్నాయి. మొన్ననే వంద కోట్ల విలువైన కార్లను సీజ్ చేసిన అధికారులు.. ఇప్పుడు వాచీలు చూసి షాక్ అయ్యారు. ఇంట్లోని రెండు గదుల్లో 10వేల విదేశీ వాచీలను గుర్తించారు. ఒక్కో వాచీ ఖరీదు లక్షల్లో ఉంటుంది. రోజుకో వాచీ పెట్టుకున్నా.. అన్నీ వాచీలు పెట్టుకోవటానికి 27 సంవత్సరాలు పడుతుంది.

60 ప్లాస్టిక్ కంటైయినర్లలో ఉన్న ఈ వాచీలు చూసి షాక్ అయ్యారు అధికారులు. ఈ 10వేల వాచీల మార్కెట్ విలువ వందల కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. ఇవన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని.. ఇన్ని వాచీలను ఎందుకు తెచ్చారో విచారణలో తేలాల్సి ఉంటుందని చెబుతున్నారు. కొన్ని వాచీలను ఇప్పటి వరకు ప్యాకింగ్ కూడా విప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాండెడ్ కంపెనీలకు చెందిన వాచీలు ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates