రోజువారీ వేతనం: పెరిగిన ఉపాధి కూలీ

MONEYఉపాధి కూలీని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీల రోజువారీ గరిష్ట వేతనాన్ని పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోనూ మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కూలీల రోజువారీ గరిష్ట వేతనం రూ.197 ఉండేది. ఈ మొత్తాన్ని రూ.205కు పెంచారు. ఈ నెల 1 నుంచి ఈ పెరిగిన వేతనం అమల్లోకి వచ్చింది.

ఉపాధి కూలీల రోజువారీ గరిష్ట వేతనాన్ని ఏటా పెంచాలని చట్టంలో తెలిపింది. దీంతో కేంద్రం ఎప్పటికప్పుడు పెంచుతోంది. దీనికి అనుగుణంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఉపాధి కూలీల రోజువారీ వేతనం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో దేశంలోనే గరిష్టంగా రూ.273 ఉంది. జార్ఖండ్‌లో అతి తక్కువగా రూ.168 వేతనం ఇస్తున్నారు. పెంచిన గరిష్ట వేతనం ప్రకారం కూలీలకు అందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates