రోజూ 40 సిగరెట్లు తాగేవాడిని… యూత్ కి సిద్దూ మెసేజ్

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో యూత్ ని ఎట్రాక్ట్ చేసే పనిలో ఉన్నాయి కన్నడ రాజకీయ పార్టీలు. యూత్ ని తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే యూత్ ని తనవైపు తిప్పుకోవడంలో మాజీ సీఎం సిద్దరామయ్య స్టైలే వేరు. ఎప్పుడూ ప్రాక్టికల్ గా మాట్లాడుతూ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంటారు. రెండు రోజుల క్రితం మైసూర్ లో కాన్సర్ చెకప్ క్యాంప్ ని ప్రారంభించారు సిద్దరామయ్య. ఈ సందర్భంగా…యువతకు ఓ ఉచిత మెసేజ్ ని ఇచ్చి వారిని ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు సిద్దూ.

కాలేజీ రోజుల్లో రోజూ 40 సిగరెట్లు తాగేవాడినని ఆయన తెలిపారు. ఒకానొక దశలో స్మోకింగ్ కి బాగా అడిక్ట్ అయిపోయానని చెప్పాడు. ఒక్కొసారి అయితే రోజుకి రెండు ప్యాకెట్లు మించి తాగేవాడేనని తెలిపారు. ఓ సారి ఫారిన్ నుంచి వచ్చిన ఓ ఫ్రెండ్ సిగరెట్ బాక్స్ తీసుకొస్తే….ఒక్కరోజులో దాన్ని ఫినిష్ చేశానని తెలిపారు. అయితే మనసులో ప్రజాసేవ చేయాలని చిన్నప్పటి నుంచి తనకు ఆశ ఉండేదని తెలిపారు. ఒకవేళ స్మోకింగ్ కారణంగా అనారోగ్యానికి గురైతే తన ఆశయం దెబ్బతింటుందని.. 31 ఏళ్ల వయస్సులో ఒకరోజు సీరియస్ గా స్మోకింగ్ మానేయాలని నిర్ణయం తీసుకొన్నట్లు సిద్దూ తెలిపారు. అప్పుడు వదిలేసిన సిగరెట్ ఇప్పటివరకూ ముట్టుకోలేదని తెలిపాడు. యువత కూడా అనారోగ్యానికి గురిచేసే ఇటువంటి అలవాట్లను వదిలేసి….తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేయాలని సిద్దూ యూత్ కి మెసేజ్ ఇచ్చాడు

Posted in Uncategorized

Latest Updates