రోడ్కెక్కిన లారీలు : సమ్మె విరమించిన రవాణా సంఘాలు

కేంద్రంతో లారీ ఓనర్స్ అసోసియేషన్ చర్చలు సఫలమయ్యాయి. లారీ, ట్రక్కు యజమానుల సమ్మె ముగిసింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెను లారీ యజమానుల సంఘం విరమించుకుంది. కేంద్ర రవాణా శాఖతో AIMTC జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వెంటనే సమ్మె విరమించాలని కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి కోరడంతో సమ్మెను విరమిస్తున్నట్టు AP లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు తెలిపారు. లారీ, ట్రక్కు యజమానుల నిరవధిక సమ్మెతో గత వారం రోజులుగా సరకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఎక్కడికక్కడ లారీలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమ్మె విరమణతో శుక్రవారం (జూలై-27) అర్థరాత్రి నుంచే లారీలు రోడ్డెక్కాయి.

ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిన అంశాలు
1) భారీ వాహనాలకు థర్డ్‌ పార్టీ ప్రీమియంపై సమీక్ష జరిపేందుకు అంగీకారం. ఈ అంశంపై ట్రాన్స్‌ పోర్టు సంఘాల ప్రతినిధులతో శనివారం (జూలై-28) ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవల్‌పమెంట్‌ అథారిటీ చర్చలు జరుపుతుంది.
2) టోల్‌ వసూలు సులభతరం: లారీలు, భారీ వాహనాలు సాఫీగా, నిరాఘాటంగా వెళ్లేందుకు టోల్‌ ప్లాజాల వద్ద 6 నెలల్లో టెక్నాలజీ సాయంతో కొత్త విధానం. ఇందుకు ఓ కమిటీ ఏర్పాటు
3) లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు, ఇతర లారీల సిబ్బందికి ప్రధాన మంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాలను వర్తింపజేయడానికి, కవరేజి ఇవ్వడానికి అంగీకారం
4) ఈఎ్‌సఐసీ కింద ఆరోగ్య సంరక్షణ విధానాల వర్తింపు
5) పర్యాటక వాహనాలకు త్వరలో జాతీయ పర్మిట్ల మంజూరు
6) డిమాండ్లపై కమిటీ: రవాణా రంగ సమస్యల పరిష్కారానికి ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు.

Posted in Uncategorized

Latest Updates