రోడ్డు పై బ్యాలెట్ బాక్స్.. ఇద్దరు అధికారులు సస్పెండ్

రాజస్థాన్ లో పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ బ్యాలెట్ బాక్స్ రోడ్డు మీద పడిపోయింది. బారన్ జిల్లాలోని కిషన్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని షాహబాద్‌ ఏరియాలో నిన్న(శుక్రవారం) రాత్రి ఈ ఘటన జరిగింది. పోలింగ్ తర్వాత వాహనాల్లో ఈవీఎంలను స్ట్రాంగ్ రూంకు తరలిస్తుండగా బ్యాలెట్ బాక్స్ కిందపడిపోయి ఉండటాన్ని పోలీసులు గమనించారు.

తర్వాత ఆ బ్యాలెట్‌ బాక్స్ ను వారు కిషన్‌గంజ్‌లో మిగతా ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులు అబ్దుల్‌ రఫీక్‌, నవల్‌ సింగ్‌ పట్వారీలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates