రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీ ఉద్యోగులు మృతి

 కోదాడ: సూర్యాపేట జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆరుగురు ఏపీ సచివాలయ ఉద్యోగులు శని, ఆదివారం సెలవులు ముగించుకొని సోమవారం అమరావతికి కారులో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు  కోదాడ మండలం దొరకుంట వద్ద ప్రమాదానికి గురైంది. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండడంతో కారు రోడ్డు కిందికి దిగి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

మృతులను భాస్కర్‌ రావు, హరికృష్ణలుగా గుర్తించారు పోలీసులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని కోదాడలోని విజయ హాస్పిటల్‌ లో చేర్పించారు. మరో ఉద్యోగి విజయలక్ష్మీ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఖమ్మంకు తరలించారు.

Posted in Uncategorized

Latest Updates