రోడ్డు ప్రమాదంలో ‘గీతం’ వర్శిటీ అధినేత మృతి

ప్రముఖ విద్యావేత్త, గీతం యూనివర్సిటీ అధినేత, ఎమ్మెల్సీ MVVS మూర్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అమెరికాలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఆయన కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని వైల్డ్‌లైఫ్ సఫారీని చూసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వ్యాను ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ప్రమాద సమయంలో మూర్తితో పాటు కారులో మరో నలుగురు ఉన్నారు. వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, VBR చౌదరి మృతి చెందగా.. కడియాల వెంకటరత్నం(గాంధీ) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న తానా సభ్యులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ నెల 6వ తేదీన కాలిఫోర్నియాలో జరగనున్న గీతం పూర్వవిద్యార్థుల  సమ్మేళనంలో MVVS మూర్తి అమెరికా వెళ్లినట్లు సమాచారం.

Posted in Uncategorized

Latest Updates