రోడ్డు ప్రమాదాలకు చెక్: ఎగిరే కార్లు

flying-cars-indiaరోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కొత్త రకం వాహనాలను త్వరలోనే మన ముందుకు  రానున్నాయి. ఇప్పటి వరకు రోడ్లపై మాత్రమే వెహికిల్స్ ను మనం చూశాం ఇకపై ఎగిరే కొత్త తరం వాహనాలను చూడబోతున్నాము. మానవ తప్పిదలతో దేశంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు టెక్నాలజీ, ఏఐ పరిజ్ఞానంతో కూడిన  కార్లు అవసరమన్నారు జనరల్ మోటార్స్ ఉపాధ్యక్షుడు బ్రైన్ మెక్ ముర్రే. గతంలో డ్రైవర్, స్టీరింగ్,పెడల్ లెస్ కార్లు తయారు చేసేవిగా ఉండేవని..భవిష్యత్తులో ఇవన్నీ నిజం కానున్నాయి.డ్రైవింగ్ లైసెన్స్, కారు బీమాకు కొత్త సవాళ్లు ఎదురవుతాయని, ఎగిరే కార్లతో వీటికి అంతరాయం కలుగుతుందన్నారు. వచ్చే ఏడాదికి డ్రైవర్ రహిత కార్లు..2030 వరకు ఎగిరే కార్లు ప్రయాణంలో భాగమవుతాయన్నారు. డ్రైవర్ రహిత కార్లు అంటే..డ్రైవర్ కు సహాయం చేసే టెక్నాలజీ ఆధారితమని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో డ్రైవర్ రహిత కార్లు భారతీయ రోడ్లపైకి వస్తాయన్నారు. ఇలాంటి కార్లు రావాలంటే 5G నెట్ వర్క్  అవసరమని, భారత్ ఇందుకు సిద్ధంగా ఉండాలన్నారు. డ్రైవర్ రహిత కార్లు రోడ్లపైకి వచ్చినప్పుడు డేటా అనుసంధానం..భద్రత ఎంతో ముఖ్యమంటున్నారు నిపుణులు.

Posted in Uncategorized

Latest Updates