రోడ్డు రోలర్ తో మద్యం బాటిళ్లను తొక్కించిన పోలీసులు


రోడ్డుపై మద్యం ఏరులై పారింది. రోడ్డు రోలర్ కిందపడి ఖరీదైన మద్యం బాటిల్స్ నుజ్జునుజ్జయ్యాయి. విదేశాలనుంచి అక్రమంగా తీసుకొచ్చి అమ్ముతున్న మద్యం బాటిళ్లను రాజేంద్రనగర్‌ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫారిన్ నుంచి తెచ్చిన మద్యం సీసాలను నగరంతో భారీ రేట్లకు అమ్ముతున్నారన్న సమాచారం అందడంతో… వారిపై నిఘూపెట్టిన ఎక్సైజ్ పోలీసులు… స్మగర్ల దగ్గర నుంచి 40 లక్షల రూపాయల విలువైన వివిధ బ్రాండ్ లకు చెందిన 640 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని అధికారుల సమక్షంలో… రోడ్డుపై వరుసగా పేర్చి రోడ్డు రోలర్ తో తొక్కించారు. తొక్కించిన మద్యం బాటిళ్లలో… బ్లాక్ లేబుల్, గోల్డ్, రెడ్ లేబుల్, గ్లన్ ఫిడిచ్, గ్లన్ లివెట్, అబ్సల్ట్ వోడ్కా తో పాటుగా మరికొన్ని ఖరీదైన బ్రాండ్ లు ఉన్నాయి.

అయితే ఇంతకుముందు బీహార్ లో కూడా మద్యపాన నిషేదం ఉన్న సమయంలో కొంతమంది అక్రమంగా మద్యం అమ్ముతుండటంతో వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు… వేల మందు బాటిళ్లను రోడ్డురోలర్ తో తొక్కించారు. అయితే అయ్యో..అనవసరంగా ఖరీదైన మద్యాన్ని ఇలా రోడ్డు పాలు చేశారో, మాకిచ్చిన బాగుండు కదా అంటూ కొంతమంది మందుబాబులు తెగ ఫీల్ అయిపోతున్నారు.

Posted in Uncategorized

Latest Updates