రోడ్డెక్కితే తాట వదులుద్ది : రేపటి నుంచి టోల్ గేట్ ఛార్జీల పెంపు

Tollనేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు టోల్ చార్జీల బాదుడు మరింత పెరగనుంది. ఆదివారం (మార్చి-31) అర్థరాత్రి నుంచి కొత్త టోల్‌చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో జాతీయ రహదారులపై డ్రైవింగ్ భారం కానుంది. జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ రేట్లును 5 నుంచి 7శాతం  పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మెజారీటి టోల్‌ ప్లాజాలపై అన్ని రకాల వాహనాలపై టోల్‌ చార్జీలు 5శాతం పెరగనున్నాయి. నెల ప్లాన్‌లో (నెలకు 50 ట్రిప్పులు) ధరలను కూడా నేషనల్‌ హైవే అథారిటీ పెంచింది. టోల్ ఛార్జీల పెంపు నిత్యావసర ధరలపై కూడా ప్రభావం చూపుతాయని అంటోంది ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్.

ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి పెంచిన టోల్‌ చార్జీలు అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా 372 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాలు, వాహనాల రాకపోకల ఆధారంగా రేట్లలో కొంచెం మార్పు ఉంటుంది.  ఇప్పటికే జాతీయ రహదారులపై టోల్‌చార్జీలు అధికంగా ఉన్నాయని.. తగ్గించాలని ఆందోళనలు చేస్తున్న సమయంలో పెంచటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు. పెరిగిన డీజిల్‌ ధరలతోపాటు టోల్‌ చార్జీలపెంపుతో.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

Posted in Uncategorized

Latest Updates