రోడ్లపై కుప్పలు తెప్పలు : ముంబై వీధులు ప్లాస్టిక్ మయం

mumbai plasticమహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ప్లాస్టిక్ తయారీ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించింది. ఒక్కసారి మాత్రమే ఉపయోగించే పడేసే ప్లాస్టిక్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉయోగించరాదని ఆదేశించింది ప్రభుత్వం. ప్రచారం కూడా విస్త్రృతంగా నిర్వహించింది. దీనిపై ప్రజలు కూడా అదేస్థాయిలో స్పందించారు. ఇళ్లల్లో ఉన్న ప్లాస్టిక్ మొత్తాన్ని రోడ్లపై పడేస్తున్నారు. చెత్త కుప్పల్లో విసిరేస్తున్నారు. ఎంతలా అంటే.. ముంబై రోడ్లపై కుప్పలు కుప్పలుగా ప్లాస్టిక్ పేరుకుపోయింది. ఓ వైపు వర్షాలు.. మరో వైపు ప్లాస్టిక్ పేరుకుపోయింది. రోజువారీగా వచ్చే ప్లాస్టిక్ వేస్ట్ కంటే.. నిషేధం అమలు తర్వాత నాలుగింతలు పెరిగింది. దీన్ని తొలగించటానికి ముంబై కార్పొరేషన్ అదనపు సిబ్బంది, వాహనాలను ఏర్పాటు చేసింది. ఇళ్లు, షాపుల్లోని ప్లాస్టిక్ అంతా బయట పడేస్తుండటంతో వీధులు అన్నీ ప్లాస్టిక్ మయం అయ్యాయి.

ప్లాస్టిక్‌ ఉపయోగించే ప్రజలు, షాపులు, మాల్స్‌పై భారీ జరిమానా కూడా విధించనున్నారు. నిబంధనలకు విరుద్దంగా ప్లాస్టిక్‌ వినియోగించే వారిపై మొదటిసారి రూ.5 వేల జరిమానా, రెండో సారి రూ.10వేల జరిమానా, మూడో సారి రూ.25వేల జరిమానాతో పాటు మూడు నెలల జైలు శిక్ష విధించాలని నిర్ణయం తీసుకుంది బీఎంసీ. ఈ నిబంధనలు జూన్‌ 24వ తేదీ ఆదివారం నుంచి అమలులోకి వస్తాయి. దీంతో ప్రజలు ముందుగానే అలర్ట్ అయ్యి.. బయటపడేస్తున్నారు. మరోవైపు 60 కంపెనీలు, 80 స్వయం సేవక సంఘాలు ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసి ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంపై వివరిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates