రోడ్లపై గుంతలే ఎక్కువ ప్రాణాలు తీస్తున్నాయి: సుప్రీంకోర్టు

దేశ వ్యాప్తంగా రోడ్ల పై ఉన్న గుంతల విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఈ గుంతలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. ‘గత ఐదేళ్లలో గుంతల కారణంగా 14,926 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. నిజానికి బోర్డర్,టెర్రరిస్ట్ ల చేతుల్లో చనిపోతున్న వారి కంటే రోడ్ల పై ఉన్న గుంతలతోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు’ అని జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

గత నాలుగు సంవత్సరాల నుంచి  ప్రతి ఏడాది రహదారులపై ప్రమాదకరంగా ఉండే గుంతల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం చూస్తుంటే రోడ్ల నిర్వహణ విషయంలో అధికారులు ఏ మాత్రం శ్రధ్ధ చూపించడం లేదని అనిపిస్తోందంటూ సుప్రీంకోర్టు ఫైర్ అయ్యింది. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కేఎస్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని కమిటీ  నివేదికపై కేంద్రం సమాధానమివ్వాలని కోర్టు ఆదేశించింది.

Posted in Uncategorized

Latest Updates