రోడ్లు జలమయం : ఢిల్లీ, యూపీలో కుండపోత వానలు

ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇటావాలో ఓ అండర్ బ్రిడ్జి కింద భారీ నీరు చేరింది. అటుగా వెళ్లిన ఓ స్కూల్ బస్సు నీటిలో చిక్కుకుపోయింది. స్థానికుల సాయంతో బస్సును బయటకు తీసుకొచ్చారు. ఢిల్లీలోని మేఘాలు కమ్మేశాయి. ఉదయం నుంచి చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ బిల్డింగ్ తో పాటు.. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఆగ్రాలో భారీ వర్షం పడింది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ స్లో అయ్యింది. ఘజియాబాద్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్ని కాలువలుగా మారిపోయాయి. దీంతో జనం ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలు కూడా చాలావరకు నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షానికి ఘజియాబాద్ లోని వసుంధర ఏరియాలో రోడ్డు పై భారీ గుంత పడింది. రోడ్డు మొత్తం కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Posted in Uncategorized

Latest Updates