రోడ్ల మరమ్మతులు.. GHMCకి ప్రతి నెలా ప్రత్యేక నిధులు : కేటీఆర్

ktrghmcహైదరాబాద్ లో రోడ్ల నిర్వహణ, మరమ్మతుల కోసం GHMCకి ప్రతి నెలా ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. వర్షాకాలంలో హైదరాబాద్ రోడ్ల నిర్వహణ ప్రణాళికపై జలమండలి కార్యాలయంలో మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షించారు. సమీక్షలో కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ లో రోడ్లను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా ప్రభుత్వం వెనుకాడదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

రాజధాని నగరంలో రోడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు కేటీఆర్. ఇప్పటికే ఒక్కో వార్డుకు ఒక్కో ఏఈ స్థాయి అధికారిని నియమించామని వెల్లడించారు. నిధులతో పాటు, అవసరమైనంత సిబ్బందిని ఇస్తున్న తర్వాత రానున్న వర్షాకాలంలో రోడ్ల నిర్వహణలో లోపాలుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు కేటీఆర్. వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలిచే ప్రాంతాల్లో రానున్న 60 రోజుల్లో శాశ్వత చర్యలు తీసుకుని ఎలాంటి సమస్య రాకుండా చూడాలని అధికారులకు నిర్దేశించారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు తీసుకుని నీళ్లు నిలిచే ప్రాంతాల గుర్తింపులో సమన్వయంతో ముందుకు పోవాలని సూచించారు.

Posted in Uncategorized

Latest Updates