రోడ్ యాక్సిడెంట్ : పున్నాగ సీరియల్ ఆర్టిస్ట్ మృతి

sunil-car-accidentరోడ్డు ప్రమాదం మరో ఆర్టిస్ట్ ను తీసుకెళ్లిపోయింది. ఇప్పుడిప్పుడే బుల్లితెరపై అవకాశాలను అందిపుచ్చుకుని ఎదుగుతున్న నటుడు నన్నం సునీల్ ఏపీ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇతని వయస్సు 24 ఏళ్లు. ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే పున్నాగ సీరియల్ లో నటిస్తున్నాడు సునీల్. అత్యంత పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చిన సునీల్ మరణం.. బుల్లితెర ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే..

ఏపీ రాష్ట్రం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం, పెనుబల్లికి చెందిన నన్నం సునీల్‌ (24), కోవూరు మండలం పెద పడుగుపాడుకు చెందిన షేక్‌ సలాఉద్దీన్‌ స్నేహితులు. సలాఉద్దీన్‌ సోదరుడు షకీల్‌ హైదరాబాద్‌ లో మ్యూజిక్‌ డైరెక్టర్‌. సునీల్, సలాఉద్దీన్‌ కూడా షకీల్‌ హైదరాబాద్‌ లో సలావుద్దీన్ దగ్గరే ఉంటూ సినిమా, టీవీ సీరియల్స్ లో నటిస్తూ ఉన్నాడు. పున్నాగు టీవీ సీరియల్ లో నటిస్తూనే.. వరంగల్‌ అనే సినిమాలోనూ నటించాడు. తమ్ముడి ఉద్యోగం నిమిత్తం పని ఉండటంతో.. హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరాడు సునీల్. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటాం అనుకుండగా.. నెల్లూరు జిల్లా రాచర్లపాడు దగ్గర జాతీయ రహదారిపై వీరి కారును.. వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టింది. స్పాట్ లోనే సునీల్ చనిపోయాడు. తన తప్పు లేకున్నా.. సునీల్ చనిపోవటం, ఎదిగి వస్తున్న కొడుకు అకాల మరణంతో ఆ కుటుంబ కన్నీరుమున్నీరు అవుతుంది. ఢీకొట్టిన వాహనం కోసం విచారణ చేస్తున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates