రోబో సృష్టికర్త..11 ఏళ్ల చిన్నోడు

manipur robotఅద్బుతాలను సృష్టించాలంటే చదువుతో మేదస్సు ఎంతో అవసరం. దీనికి వయస్సుతో సంబంధలేదని రుజువు చేశాడు ఓ స్కూల్ విద్యార్థి. మణిపూర్ రాష్ట్రానికి చెందిన పదకొండేళ్ళ అభినందన్ దాస్ తన సొంత తెలివితేటలతో రోబోను తయారు చేశాడు. అది గ్లాస్ ను పట్టుకోవడాన్ని ప్రదర్శింప చేశాడు.

యార్లపట్‌లోని మెగా మణిపూర్‌ స్కూలులో ఆరో తరగతి చదువుతున్న అభినందన్ దాస్.. వ్యర్థ పదార్థాలతో…సొంతంగా ‘రోబో’ తయారు చేసాడు.  ఆ రోబోకు ‘మెగానంద్-18’ అనే పేరు కూడా పెట్టాడు. ఐవీ పైపులతో హైడ్రాలిక్ సిస్టమ్‌ ఉపయోగించడం ద్వారా ఈ రోబో చేతులు కదిపేలా తయారు చేశాడు.  ఈ రోబో మంచినీళ్ళ గ్లాసును కూడా పట్టుకోవటాన్ని చూపించాడు. రోబో తయారీకి 20 రోజులు పట్టిందట.

Posted in Uncategorized

Latest Updates